తగ్గని ‘రంగస్థలం’ జోరు.. 3.5 మిలియన్ తాకింది !

రామ్ చరణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘రంగస్థలం’ విడుదలై నెల రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద మంచి రన్ ను కనబరుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం యూఎస్లో నాన్ బాహుబలి రికార్డుని సృష్టించింది. తాజా సమాచారం మేరకు ఇప్పటి వరకు 3.5 మిలియన్లను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం ఇంకా కొన్ని లొకేషన్లలో బాగానే నడుస్తోంది.

‘మగధీర’ తర్వాత రామ్ చరణ్ కెరీర్లో ఆ స్థాయి విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడ బాహుబలి తర్వాతి స్థానంలో నిలబడింది. రామ్ చరణ్ అసామాన్య నటన, సుకుమార్ టేకింగ్ కలిసి సినిమాను ఉన్నతంగా నిలబెట్టాయి. చరణ్ తొలిసారి చేసిన ప్రయోగం మంచి ఫలితాన్ని ఇవ్వడంతో ఆయన భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసే అవకాశముంది.

Exit mobile version