1700 థియేటర్లలో విడుదలకానున్న ‘రంగస్థలం’ !

29th, March 2018 - 02:54:00 PM

రామ్ చరణ్, సమంతలు జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’ రేపు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు నిర్మాతలు. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నందు వలన చిత్రాన్ని భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని ఇతర ఏరియాలు, అమెరికాలో కలిపి మొత్తం 1700 థియేటర్లలో సినిమా విడుదలకానుంది. దీంతో సినిమా ఓపెనింగ్స్ పెద్ద మొత్తంలోనే ఉండనున్నాయి. 1980ల కాలంలోని గ్రామీణ నైపథ్యంలో నడిచే సినిమా కావడం వలన వాస్తవికత కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి సినిమా కోసం ప్రత్యేకమైన విలేజ్ ను రూపొందించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.