హిట్ నుండి సూపర్ హిట్ దిశగా ‘రంగస్థలం’ !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం గత శుక్రవారం విడుదలై మొదటిరోజే ప్రేక్షకుల నుండి పాజిటివ్ స్పందన తెచ్చుకుని హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. వారాంతపు రోజులు శని, ఆదివారాల్లో కూడ రన్ ఏమాత్రం తగ్గకపోవడంతో చిత్ర కలెక్షన్లు భారీ స్థాయిలో నమోదై చిత్రం హిట్ నుండి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

రెండు రోజులకుగాను తెలుగు రాష్ట్రాల్లో రూ.28.57 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాల అంచనాలు మేరకు ఆదివారం ముగిసేనాటికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 35 కోట్లు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 53 కోట్ల షేర్ ను రూ.84 కోట్ల వరకు గ్రాస్ ను రాబట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘మగధీర’ తరవాత రామ్ చరణ్ కు ఇదే గొప్ప విజయమని చెప్పొచ్చు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.