‘శ్రీమంతుడు’ రికార్డును బ్రేక్ చేసే దిశగా ‘రంగస్థలం’ !


తొలిరోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ‘రంగస్థలం’ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలిరోజే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం శని, ఆదివారాల్లో మంచి రన్ కనబర్చి మొదటి వారాంతానికి 2.32 మిలియన్ డాలర్లను రాబట్టుకుంది.

ఇంకొద్ది రోజుల్లో ఈ మొత్తం అవలీలగా 3 మిలియన్ డాలర్లను టచ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్లో ‘బాహుబలి-2, బాహుబలి-1’ తర్వాత మహేష్ బాబు యొక్క ‘శ్రీమంతుడు’ 2.87 మిలియన్ డాలర్ల ఫుల్ రన్ తో మూడవ స్థానంలో ఉండగా ఇప్పుడు ‘రంగస్థలం’ ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా వెళుతోంది. ఇక ఈ చిత్రం ఫుల్ రన్ గ్రాస్ కూడ పెద్ద మొత్తంలోనే ఉండే అవకాశాలున్నాయి.