కృష్ణా ఏరియాలో ‘రంగస్థలం’ వసూళ్ల వివరాలు !

1980ల నైపథ్యంలో రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం నిన్న తొలిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చింది. రామ్ చరణ్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని, విమర్శకుల్ని ఆకట్టుకున్నాడు. విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం కృష్ణా ఏరియాలో రూ.1. 55 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి సుమారు రూ.19 కోట్లకు పైగానే షేర్ ను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం శని, ఆదివారాల్లో కూడ భారీగా వసూళ్లను కొల్లగొట్టనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల మేరకు ఈ చిత్ర్రం రామ్ చరణ్ కెరీర్లోనే ఉత్తమమైన వసూళ్లును నమోదుచేసే చేసే సూచనలు కనిపిస్తున్నాయి.