ఇప్పుడు విదేశాల్లో నితిన్ “రంగ్ దే”..!

Published on Nov 26, 2020 11:00 am IST

తన లేటెస్ట్ చిత్రం “భీష్మ”తో మంచి సాలిడ్ కం బ్యాక్ అందుకున్న టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ అదే ఫామ్ ను కొనసాగించడానికి మొదలు పెట్టిన మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “రంగ్ దే”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అలాగే ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రం షూటింగ్ పై అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలకు గాను దుబాయ్ పయనమయ్యారు. ఇప్పుడు ఈ షూట్ లోనే హీరో నితిన్ అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ లు ఈ షూట్ లో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More