క్రికెటర్ వార్న్ తో బాలీవుడ్ స్టార్ హీరో ఏంటి కథా?

క్రికెటర్ వార్న్ తో బాలీవుడ్ స్టార్ హీరో ఏంటి కథా?

Published on Jun 2, 2019 7:59 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో తాజాగా ‘గల్లీ బాయ్’ తో మంచి విజయం అందుకుని వరుస విజయాలతో మంచి ఊపుమీదున్నారు. ప్రస్తుతం రణ్వీర్ క్రికెటర్ భారత్ కు మొదటి క్రికెట్ వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ బయో పిక్ లో కపిల్ రోల్ ని చేస్తున్నాడు. “83” అనే టైటిల్ తో తెరకెక్కతున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి.

రణ్వీర్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ తో కలిశారు. ఆయన తో కలిసిదిగిన ఫొటోని రణ్వీర్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. రణ్వీర్ క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కుతున్న “83” మూవీలో నటించడంతో ఈ ఫొటో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సునీల్ గవాస్కర్ ని కూడా రణ్వీర్ కలిశారు. రణ్వీర్ క్రికెటర్ గా ప్రేక్షకులని మెప్పించడానికి ఇలాంటి మాజీ క్రికెటర్స్ దగ్గర మెళుకువలు నేర్చుకుంటున్నాడా, అందుకే మాజీ క్రికెటర్లను కలుస్తున్నాడా? అనేది తెలియాలి. కబీర్ ఖాన్ నిర్మిస్తున్న ఈ మూవీ ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు