ఆ క్రికెటర్ లుక్ లో రణ్వీర్ సింగ్, చూస్తే షాక్ కావాల్సిందే

ఆ క్రికెటర్ లుక్ లో రణ్వీర్ సింగ్, చూస్తే షాక్ కావాల్సిందే

Published on Jul 6, 2019 8:48 AM IST

భారత్ కి మొదటి క్రికెట్ ప్రపంచ కప్ అందించిన లెజెండరీ క్రికెటర్ అయిన కెప్టెన్ కపిల్ దేవ్ బయో పిక్ “83” అనే పేరుతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ కపిల్ గా చేస్తుండగా దీపికా పదుకొనె ఆయన భార్య పాత్రలో నటిస్తుంది. నేడు రణ్వీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా “83” మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మెడలో నల్లని తాడు,ఉంగరాల జుట్టు, వైట్ స్పోర్ట్స్ టి షర్ట్ ధరించి బంతిని గాల్లోకి ఎగరేసి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ వైపు కసిగా చూస్తున్నట్లుగా ఉన్న రణ్వీర్ లుక్ ఆసక్తికరంగా ఉంది. దాదాపు యంగ్ ఏజ్ లో కపిల్ దేవ్ పోలికలకు దగ్గరగా మారి అచ్చు రణ్వీర్ ఆయనలాగే కనిపిస్తున్నాడు.

కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్,విబ్రి మీడియా, సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు