‘వైఎస్ఆర్ బయోపిక్’లో నటించనున్న రావు రమేష్ !

తెలుగు ఇండస్ట్రీలో బయోపిక్ల జోరు కొనసాగుతుంది . ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివగంత ‘వై ఎస్ రాజశేఖర్ రెడ్డి’ గారి జీవిత చరిత్రతో సినిమా తెరకెక్కిస్తున్నవిషయం మనకు తెలిసిందే . ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో ప్రఖ్యాత మలయాళ నటుడు ‘మమ్ముట్టీ’ నటిస్తున్నారు.

నిజ జీవితంలో రాజశేఖర్ రెడ్డి గారికి మంచి స్నేహితుడైన ‘కేవిపి రామచంద్రరావు’ గారి పాత్రలో ‘రావు రమేష్’ నటిస్తున్నారు. రావు రమేష్ తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకున్నారు . అలాగే వైఎస్ఆర్ బయోపిక్ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ‘నాదెండ్ల భాస్కర్ రావు’ గారి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ‘సచిన్ కెడ్కర్’ నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వైఎస్ఆర్’ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ పతాకంఫై విజయ్ చిల్ల , శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

Exit mobile version