మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల సినిమాలో రావు రమేష్..?

మహేష్ బాబు – శ్రీకాంత్ అడ్డాల సినిమాలో రావు రమేష్..?

Published on Jan 22, 2015 3:18 AM IST

Rao-Ramesh1
రావు గోపాలరావు తనయుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్, తన కంటూ ఓ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రౌడీ ఫెలో’, ‘ముకుంద’ సినిమాలలో అతని నటనకు ప్రసంశలు లభించాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే ‘బ్రహ్మోత్సవం’లో కీలక పాత్ర రావు రమేష్ కు దక్కింది.

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రావు రమేష్ ను దృష్టిలో పెట్టుకుని ఓ క్యారెక్టర్ డిజైన్ చేశారట. ఈ వార్తను అధికరికంగా వెల్లడించకపోయినా, నిజమేనని యూనిట్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. పివిపి సినిమాస్ పతాకంపై ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.

తాజా వార్తలు