సౌత్ ఇండియాలోనే ఆ ఫీట్ సాధించిన ఏకైక హీరో రామ్

Ismart

హీరో రామ్ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. యూట్యూబ్ లో నాలుగు 100 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాల హీరోగా రికార్డులకు ఎక్కాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ హిందీ వర్షన్ యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులకు ఎక్కింది. ఆదిత్య మూవీస్ ఈ చిత్ర హిందీ ప్రదర్శన హక్కులు సొంతం చేసుకోగా, ఫిబ్రవరి 16న యు ట్యూబ్ లో విడుదల చేశారు. కాగా విడుదలైన 45 రోజుల్లో ఇస్మార్ట్ శంకర్ హిందీ 100 మిలియన్ వ్యూస్ కి చేరుకుంది.

గతంలో రామ్ నటించిన ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ హిందీ వర్షన్స్ యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ ఆ ఫీట్ నాలుగవ సారి సాధించాడు. సౌత్ ఇండియా మొత్తంలో ఈ రికార్డు అందుకున్న ఏకైన హీరో రామ్. ఇక రామ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ మూవీ చేస్తున్నారు.

Exit mobile version