
జిల్ సినిమా మంచి విజయం సాధించడంతో అందాల బొమ్మ రాశీ ఖన్నా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశీకి ఇది మూడవ చిత్రమే అయినా తన నటనతో, అందాల ఆరబోతతో ప్రేక్షకులకు చేరువైంది.
ముఖ్యంగా రాశీ గ్లామర్ గురించే ప్రేక్షకుల చర్చ మొత్తం కావడం విశేషం. ఈ సినిమా తరువాత నిర్మాణ సంస్థలు ఈ డిల్లీ భామ ముందు వరుస కడుతున్నాయి. రాశీ ఖన్నా ప్రస్తుతం రవితేజతో కలిసి బెంగాల్ టైగర్ సినిమాలో నటిస్తుంది.