ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన రష్మీ గౌతమ్

ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన రష్మీ గౌతమ్

Published on Feb 13, 2024 2:47 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం లోని కుర్చీ మడతపెట్టి సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటలోని మాస్ స్టెప్స్ కి ఆడియెన్స్ నుండి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ పాటలో పూర్ణ చేసిన రోల్ కి రష్మీ గౌతమ్ ను ముందుగా సంప్రదించినట్లు వస్తున్న వార్తల పై ఆమె స్పందించారు. అలా తను రిజెక్ట్ చేయలేదు అని పేర్కొంది. అంతేకాక ఇలాంటి అవాస్తవాలని నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చారు. పూర్ణ పెర్ఫార్మెన్స్ ఈ పాటలో చాలా ఆకట్టుకుంటుంది. మహేష్ బాబు, శ్రీ లీల లతో పాటుగా పలు స్టెప్స్ పూర్ణ పై కూడా ఉన్నాయి. థమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు