‘ఛలో’ సినిమా తో తెలుగు తెరకు రష్మిక మందన హీరోయిన్ గా పరిచయమైతే అదే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వెంకీ కుడుముల. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వీరిద్దరికి మంచి గుర్తింపు లభించింది.
ఇక ఈ సినిమా తరువాత రష్మిక తెలుగులో నటించిన రెండవ చిత్రం ‘గీత గోవిందం’ ఇటీవల విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది. దాంతో ఆమెకు వరుసగా ఆఫర్ల వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన ‘దేవదాస్’ విడుదలకు సిద్దమవుతుంది. ఈసినిమాతో పాటు విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో నటిస్తుంది.
ఇక ‘ఛలో’ సినిమా తరువాత వెంకీ కుడుముల నితిన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నితీన్ కి జోడి గా రష్మిక ను తీసుకోవాలని భావిస్తున్నాడట ఈ దర్శకుడు. త్వరలోనే ఈ వార్తలపై క్లారిటీ రానుంది.
