మహేశ్ పక్కన ఛాన్స్ కొట్టేసిన క్రేజీ హీరోయిన్ !

Published on May 27, 2019 9:17 pm IST

ఛ‌లో, గీత గోవిందం చిత్రాల‌తో వరుస విజ‌యాలను అందుకుని టాలీవుడ్ లో తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకుంది రష్మికా మండన్న. అయితే ఆ క్రేజ్ ని మరో స్థాయిలోకి తీసుకెళ్లే ఆఫర్ వచ్చింది రష్మికాకి. సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయిన్ గా నటిస్తోన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రష్మికా మహేశ్ సరసన నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయం స్వయంగా రష్మికానే తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా మే 31వ తేదీన ఈ చిత్రం అధికారికంగా లాంచ్ కానుంది. అలాగే త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. మరి మహేశ్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఆలాగే రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోందట. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం :

More