అభిమానులకు అందుబాటులోకి వచ్చిన రష్మిక..!

అభిమానులకు అందుబాటులోకి వచ్చిన రష్మిక..!

Published on Jan 5, 2020 11:46 AM IST

Rashmika Mandanna

బ్యూటీ రష్మిక మందాన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. వారు అడిగే ప్రశ్నలకు క్యూట్ గా ఆసక్తికర సమాధానాలు చెవుతున్నారు. నేడు ట్విట్టర్ వేదికగా అభిమానులతో చాట్ చేస్తానని.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతానని రష్మిక నిన్న ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. నేటి ఉదయం 11 గంటల నుండి రష్మిక ట్విట్టర్ లైవ్ లోకి వచ్చి అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా ఆమె అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రష్మిక ను ఏమి అడగలనుకుంటున్నారో అడిగేయండి.

మహేష్ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ఈనెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో లేడీ అమితాబ్ విజయ శాంతి చాలా కాలం తరువాత ఓ కీలక రోల్ చేస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు