ఛలో చిత్రంలో హీరోయిన్ గా నటించి మంచి విజయం సాధించిన యువ నటి రష్మికా మండన్నా. తెలుగులో ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ సంపాధించుకుంది రష్మికా. దానికి తోడు గీతగోవిందం చిత్రంలో నటిస్తుండటం.. టీజర్ మరియు ట్రైలర్లలో రష్మికా అందం ఆమె హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రష్మికాకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. గీతగోవిందం చిత్రం పై బజ్ ఉండటం, బడా నిర్మాత అల్లు అరవింద్ చిత్రాన్ని నిర్మిచడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.
కాగా ఈ చిత్రం విడుదలైన తర్వాత రష్మికా మండన్నాకు యువతలో మంచి క్రేజ్ వస్తుందని చెబుతుంది చిత్రబృందం. ముఖ్యంగా ఆమె పాత్ర ఈ చిత్రంలో అబ్బాయిలతో పాటు, అమ్మాయిలను కూడా విపరీతంగా అలరిస్తుందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల్లో అయితే రష్మికా విజయ్ దేవరకొండను కూడా డామినేట్ చేసేలా నటిచిందట. పైగా దర్శకుడు పరుశురాం రష్మికాను చాలా రొమాంటిక్ గా, ఆమె పాత్రను సినిమాలో బాగా హైలెట్ చేస్తూ చూపించారు. ఇక పూర్తి రొమాంటిక్ కామెడీగా రాబోతున్న ఈ చిత్రం ఆగష్టు 3న గ్రాండ్ విడుదల కాబోతుంది.


