“పుష్ప” ఫస్ట్ ఛాయిస్ రష్మికా కాదట.!

Published on Mar 8, 2021 4:15 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన ఆల్ టైం మరి హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఈ కాంబో మొదటి సారిగా పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నప్పటికీ ఆ హైప్ ను మేకర్స్ తెచ్చుకున్నారు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ రష్మికా మందన్నా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ మరియు సుకుమార్ లతో కూడా రష్మికా కు ఇది మొదటి ప్రాజెక్టు కావడంతో ఈ కాంబో మరింత ఇంట్రెస్టింగ్ గా తయారయ్యింది. అయితే అసలు ఈ చిత్రానికి హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ రష్మికా మందన్నా కాదట.

ఈ విషయాన్ని దర్శకుడు సుకుమార్ నే చెప్పారు. లేటెస్ట్ చిత్రం “ప్లే బ్యాక్” మీటింగ్ లో మాట్లాడుతూ తాను ఇప్పుడు చేస్తున్న “పుష్ప” కి కూడా ఒక తెలుగు హీరోయిన్ నే తీసుకుందాం అనుకున్నానని కానీ కుదరకపోవడంతో రష్మికాను తీసుకున్నామని తెలిపారు. అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా ఓ తెలుగు హీరోయిన్ తోనే చేస్తానని సుక్కు క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :