ఒక సినిమాని ఒప్పుకునేముందు నేను చూసే అంశాలు ఇవే – రష్మిక మందన్న

ఒక సినిమాని ఒప్పుకునేముందు నేను చూసే అంశాలు ఇవే – రష్మిక మందన్న

Published on Mar 2, 2024 9:00 PM IST


టాలీవుడ్ స్టార్ నటి రష్మికమందన్న ఇటీవల ఆనిమల్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం పుష్ప ది రూల్, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో సహా పలు ఇతర సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు రష్మిక. విషయం ఏమిటంటే, తాజాగా ఒక బాలీవుడ్ మీడియా పోర్టల్ తో రష్మిక మాట్లాడుతూ, తాను ఒక సినిమాకి తాను సైన్ చేసేటపుడు ముఖ్యంగా స్క్రిప్ట్ ని క్షుణ్ణంగా వింటానని అన్నారు.

అలానే తన పాత్ర కనుక నచ్చితే వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను అన్నారు. అయితే తాను ఎంపిక చేసుకునే సినిమాల్లో సోషల్ మెసేజ్ ఉండేలా తాను చూసుకుంటానని, కానీ అది అన్ని సినిమాలకు సాధ్యం కానప్పటికీ కొన్ని మల్టిపుల్ జానర్ సినిమాల్లో సోషల్ మెసేజెస్ ఉంటె అవి ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ అవుతాయనేది తన ఆలోచన అన్నారు. అందుకే అటువంటి స్క్రిప్ట్స్ కి తాను ఎప్పుడూ సిద్ధం అని అన్నారు రష్మిక.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు