ఇటీవల బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న, హిందీలో తనదైన ముద్ర వేస్తోంది. ‘యానిమల్’, ‘ఛావా’, ‘థామా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, తొందరపడకుండా అటు సౌత్ సినిమాలు ఇటు బాలీవుడ్ కెరీర్‌ను ఎంతో సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న నెక్స్ట్ హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
హోమి అదజానియా దర్శకత్వంలో మ్యాడాక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక, కృతి సనన్ ఇద్దరూ కూడా ఎంతో గ్లామరస్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. జూన్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
అయితే ఈ సినిమాకు గాను రష్మిక అందుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ‘కాక్టెయిల్ 2’ కోసం ఆమె ఏకంగా రూ. 12 కోట్లు అందుకుంది, రష్మిక కెరీర్లో ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం. ఇదే చిత్రానికి షాహిద్ కపూర్ రూ. 35 కోట్లు, కృతి సనన్ రూ. 14 కోట్లు వసూలు చేశారు. ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా రష్మిక తన చేయబోయే హిందీ చిత్రాలకు రూ. 15 కోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది.
