బాలీవుడ్ ఫిల్మ్ కి క్రేజీ బ్యూటీ రెడీ !

Published on Jan 25, 2021 9:00 pm IST

క్రేజీ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన “మిషన్ మజ్ను” అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం షూట్ వచ్చే వారం నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. కాగా రష్మిక తన బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వచ్చే వారం నుండి డేట్స్ కేటాయించిందట.

ఇక “మిషన్ మజ్ను” సినిమా కథ ప్రకారం సౌత్ ఇండియన్ భామ కావాలి కాబట్టి, రష్మికను వాళ్ళు తీసుకున్నారు. కానీ, రష్మికకు ఈ సినిమా ఎంతవరకూ ప్లస్ అవుతుందో చూడాలి. “సరిలేరు నీకెవ్వరు”, “గీత గోవిందం” సినిమాలు చూసి రష్మిక యాక్టింగ్ పై బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారట. “మిషన్ మజ్ను” డైరెక్టర్ కు కూడా రష్మిక నటన బాగా నచ్చిందట.

అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సరసన డెడ్లీ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ చిత్రంలో ఆమె కనిపించనుంది. తండ్రి-కుమార్తె కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్వీన్, సూపర్ 30 దర్శకుడు వికాస్ బహల్ దర్శకత్వం వహించనున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్టును నిర్మి స్తోంది, మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :