మహేశ్… ‘సరిలేరు నీకెవ్వరు’ !

Published on May 31, 2019 10:00 am IST

మహేశ్ బాబు తన తరువాత సినిమాను అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో అధికారికంగా పూజ కార్యక్రమంతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. కాగా ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

ఇక మహేశ్ బాబు ‘మాహర్షి’తో భారీ సక్సెస్ ను అందుకున్న తరువాత చేస్తోన్న సినిమా కావడంతో, ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలే ఉంటాయి. ఇక ఇటీవలే ‘ఎఫ్ 2’తో భారీ హిట్ ను కొట్టాడు అనిల్. మరి మహేశ్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమాలో ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అయితే విజయశాంతి మహేష్ బాబుకు అత్తగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు

సంబంధిత సమాచారం :

More