సినిమాల్లో హీరోలను ‘క్రికెటర్’గా చూపించిన సందర్బాలు చాలానే వున్నాయి.ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఒక హీరోయిన్ ను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా చూపించనున్నారు.విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హీరోయిన్ ‘రష్మిక మండన్న’ క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు.ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు.భరత్ కమ్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు .
‘ఛలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రష్మిక ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా తో పాటు నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న మల్టీస్టారర్ సినిమాలో నానీకి జోడీగా నటిస్తున్నారు.


