స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్నా ?

స్పెషల్ సాంగ్ లో రష్మిక మందన్నా ?

Published on May 17, 2024 9:37 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందా ? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రాబోతుంది. కాగా ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్ గా జాన్వీకపూర్‌ నటించనుంది. ఐతే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ ను రష్మిక మందన్నా చేత చేయిస్తే బాగుంటుందని తాజాగా మేకర్స్ ఫీల్ అవుతున్నారు. మరి రష్మిక మందన్నా ఈ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

కాగా ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. అన్నట్టు యానిమల్ సినిమాతో విలన్ గా ఫామ్ లోకి వచ్చిన బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు