మీరు చెప్పండి, నేను చేస్తా అంటున్న రష్మిక

Published on Jun 3, 2020 3:01 pm IST

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళుతుంది రష్మిక మందాన. లక్కీ లేడీగా పేరున్న రష్మిక టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మహేష్ వంటి స్టార్ హీరో పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. ఈమె నటించిన చాలా చిత్రాలు విజయం సాధించినవే. ఈమె తదుపరి చిత్రం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ చిత్రం కూడా విజయం సాధిస్తే అమ్మడుకి ఇక తిరుగు లేనట్టే.

కాగా రష్మిక ఓ విషయం తెలుసుకోవాలని ఆరాట పడుతుంది. ఆ విషయం ఏమిటో చెప్పండి అని ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ ని అడుగుతుంది. రష్మిక భవిష్యత్తులో ఎలాంటి చిత్రాలు మరియు పాత్రలు చేయాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారో ఆమెకు చెప్పాలట. ఫ్యాన్స్ అభిప్రాయాల ఆధారంగా ఆమె తన పాత్రలు ఎంచుకుంటుంది అట. ఫ్యాన్స్ కూడా ఆమెకు వేలల్లో మెస్సేజ్ లు పంపారు. మరి వాటిలో ఏవి ఆమె స్వీకరిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More