హీరో విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మికతో కలిసి ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్‌లోని విద్యార్థుల ‘మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ జాబితాను రిలీజ చేశారు. కాగా స్కాలర్‌షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. “ఈరోజు నేను రష్మిక మందన్న దేవరకొండలా మాట్లాడుతున్నాను. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి’ అని ఆమె స్టూడెంట్స్ కి సూచించారు.
రష్మిక స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ, మెరిట్ స్కాలర్‌షిప్ అవార్డీస్’ ఎవరికీ ఇచ్చారు అంటే.. విజయ్ స్వగ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ తుమ్మన్‌పేట పాఠశాల నుంచి 9వ తరగతిలో బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్‌షిప్ సాధించారు. మొత్తానికి 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఈ ఉపకారవేతనాలు విజయ్ అందజేశారు.
–


