విజయ్ దేవరకొండ సినిమాలో రస్మిక పాత్ర ఇదే !

విజయ్ దేవరకొండ నెక్స్ట్ కొత్త దర్శకుడు భరత్ తో సినిమా చెయ్యబోతున్నాడు ఈ సినిమాలో రాస్మిక నటించబోతోంది. ఇదివరుకే వీరిద్దరు పరుశురం బుజ్జి దర్శకత్వంలో నటిస్తున్నారు. రెండోసారి వీరిద్దరు కలిసి నటిస్తుండడం విశేషం. చలో సినిమా మంచి విజయం సాధించడంతో ఈ హీరోయిన్ కు వరుసగా సినిమాలు వస్తున్నాయి.

ఈ మూవీ లో రాస్మిక స్పోర్ట్స్ ఉమెన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. లవ్ స్టోరి గా తెరకేక్కబోయే ఈ సినిమా వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. పెళ్లి చూపులు నిర్మాత యష్ రంగినేని, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాల సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో పాటు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో.

Exit mobile version