రథేరా మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన స్టార్ డైరెక్టర్ !

రథేరా మూవీ ట్రైలర్ ను ఆవిష్కరించిన స్టార్ డైరెక్టర్ !

Published on Jul 26, 2019 2:15 AM IST

పూల సిద్దేశ్వరరావు హీరోగా పరిచయమవుతున్న చిత్రం రథేరా. జాకట్ రమేష్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పూల సిద్దేశ్వర రావు, నరేష్ యాదవ్, వై ఎస్ కృష్ణమూర్తి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్ ఇటీవల తన కార్యాలయంలో విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో హీరో పూల సిద్దేశ్వర రావు, దర్శకుడు జాకెట్ రమేష్, నిర్మాత వై ఎస్ కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, నీనోరకం చిత్ర దర్శకుడు సుదర్శన్ మరియు సుగన్ తదితరులు పాల్గొన్నారు…
ఈ సందర్భంగా డేరింగ్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ – ” ట్రైలర్ చాలా బాగుంది, ఆర్టిస్టులు అందరూ కొత్తవారిని తీసుకొని అద్భుతంగా దర్శకుడు రమేష్ సినిమాను రూపొందించారు. దర్శకుడు మంచి కంటెంట్ తో సినిమా తెరకెక్కించారు. మ్యూజిక్ తో పాటు ఆర్.ఆర్ కూడా బాగుంది. నిర్మాత కృష్ణమూర్తి గారికి ఈ సినిమా ద్వారా మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను ” అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ – ” వినాయక్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఎంతో ఫ్యాషన్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆర్టిస్టులు, టెక్నీషన్స్ ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీ అందరకీ నచ్చుతుంది” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు