సెన్సార్ పూర్తి చేసుకున్న విశాల్ “రత్నం”

సెన్సార్ పూర్తి చేసుకున్న విశాల్ “రత్నం”

Published on Apr 17, 2024 1:54 PM IST


కోలీవుడ్ యాక్టర్ విశాల్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరి డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం. ప్రియా భవాని శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 26, 2024 న వరల్డ్ వైడ్ గా తమిళ బాషలో మాత్రమే కాకుండా, తెలుగు లో కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ ను ఇచ్చారు. రన్ టైం పై క్లారిటీ రావాల్సి ఉంది. స్టోన్‌బెంచ్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్‌లపై కార్తెకేన్ సంతానం మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు