మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం ప్రమోషన్స్ శరవేగంగా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. గతేడాది విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో రామ్ చరణ్ ఆడిన వెరైటీ క్రికెట్ షాట్ అందరినీ ఆకట్టుకుంది. క్రీజులోకి వచ్చి, బ్యాట్‌ను నేలకు కొట్టి, ఆపై బంతిని సిక్సర్‌గా మలిచే ఆ స్టైల్ ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన ‘రై రై రా రా’ పాట చివర్లో కూడా ఇటువంటి మరో వెరైటీ షాట్ కనిపించడంతో, ఈ విలక్షణమైన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తాజాగా రివీల్ చేశారు.
పెద్ది క్యారెక్టర్ ఒక పక్కా ప్రొఫెషనల్ క్రికెటర్ కాదని.. అతను ఊళ్లో తిరిగే ఒక మాస్ కుర్రాడు, గల్లీ క్రికెట్ ఆడే వ్యక్తి అని.. అందుకే అతనికి టెక్స్ట్‌బుక్ షాట్స్ అయిన కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్ వంటివి తెలియవని.. తనదైన శైలిలో నోట్లో బీడీ పెట్టుకుని, రకరకాల స్టంట్లు చేస్తూ బంతిని బాదుతుంటాడని రత్నవేలు తెలిపారు. ఈ షాట్స్ సహజంగా ఉండటం కోసం స్థానిక గల్లీ క్రికెటర్లతో చర్చించి వీటిని డిజైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ మరియు బొమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 4న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానున్న ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
