మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి క్రియేటివ్ దర్శకుల్లో రవిబాబుకి సెపరేట్ ట్రాక్ రికార్డ్ ఉంది. కామెడీ, హారర్, క్రైమ్ థ్రిల్లర్ జానర్స్ లో తను సత్తా చాటారు. అయితే సినిమాలు పరంగానే పలు బోల్డ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ రవిబాబు వార్తల్లో వినిపిస్తూ ఉంటారు. ఇలా లేటెస్ట్ గా తన కొత్త సినిమా రేజర్ ప్రమోషన్స్ లో చేస్తున్న పలు కామెంట్స్ ఈ మధ్య వైరల్ గా మారుతున్నాయి. ఇలా లేటెస్ట్ గా సామాన్యుడికి సినిమా ఎలా దూరం చేస్తున్నారు అనే దానిపై బోల్డ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.
ఒక సామాన్యుడు కుటుంబంతో మల్టీప్లెక్స్ లో సినిమా ఎంజాయ్ చెయ్యాలంటే 3 వేల రూపాయలు ఖర్చు చేయడం అనేది ఎంత స్టుపిడ్ పని అని, 20 నుంచి 30 వేలు సంపాదించే వాళ్ళు రెగ్యులర్ గా సినిమాలు చూడాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇండస్ట్రీనే కామన్ ఆడియెన్స్ కి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని మెల్లగా దూరం చేస్తున్నారు అని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.


