ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు అవసరమైతే పలు చిన్న సినిమాలలో అతిధి పాత్రల్లో కనిపించడం లేదా ఆ సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటివి జరిగిపోతున్నాయి. ఇదే కోవలో రవితేజ కూడా అడపాదడపా అతిధి పాత్రల్లో కనిపించాడు. పలు సినిమాలకు వాయిస్ ఓవర్ అందించాడు. రవితేజ ఇటీవలే సాయిరాం శంకర్ హీరోగా వచ్చిన ‘రోమియో’ సినిమాలో రవితేజ హీరోకి అన్నయ్య పాత్రలో కాసేపు కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా రవితేజ మరో సినిమాలో అతిధి పాత్ర చేసాడు. అది తెలుగు సినిమా కాకపోవడం విశేషం.
మొదటిసారి రవితేజ ఓ కన్నడ సినిమాలో అతిధి పాత్ర చేసాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా తెరెఅకెక్కుతున్న సినిమా ‘వజ్రకాయ’. ఈ సినిమాలో రవితేజ ఓ అతిధి పాత్ర పోషించాడు. ఇటీవలే రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొని తన పాత్రకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసాడు. ఇది కాకుండా రాసితేజ ప్రస్తుతం ‘కిక్ 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. అది పక్కన పెడితే రవితేజ నటించనున్న ‘బెంగాల్ టైగర్’ సినిమా మార్చి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.


