ఆ మూవీలో మళ్ళి తన మార్క్ రోల్ లో రవితేజ ?

ఆ మూవీలో మళ్ళి తన మార్క్ రోల్ లో రవితేజ ?

Published on Feb 27, 2024 1:04 AM IST

మాస్ మహారాజా రవితేజ ఇటీవల యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఈగిల్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించారు. థియేటర్స్ లో ఆడియన్స్ ని అలరించి మంచి విజయం అందుకుంది ఈ మూవీ. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు రవితేజ. బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించిన రెయిడ్ మూవీకి అఫీషియల్ రీమేక్ ఇది.

అయితే అతి త్వరలో కామెడీ సినిమాల దర్శకుడు అనుదీప్ కెవితో ఒక మూవీ చేయనున్నారు రవితేజ. అతి త్వరలో పూర్తి వివరాలతో కూడిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్న ఈ మూవీలో మళ్ళి తన మార్క్ స్టైల్ యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్ పాత్రలో రవితేజ కనిపించనున్నారట. ఎంతో ఫన్నీ గా ఎంటెర్టైమెంట్ గా సాగనున్న ఈ మూవీలో సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు