మల్టీస్టారర్ సినిమాలకు రెడీ – రవితేజ

మల్టీస్టారర్ సినిమాలకు రెడీ – రవితేజ

Published on Sep 21, 2014 4:18 PM IST

ravi-teja

మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి నేను రెడీ, నాకు ఇష్టం కూడా. గతంలో ఖడ్గం, శంభో శివ శంభో సినిమాలలో నటించాను. మంచి కథలు వస్తే ఇప్పుడు కూడా ఇతర హీరోలతో కలసి నటించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నారు హీరో రవితేజ. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ మాస్ మహారాజ్ ‘పవర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద జయకేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ పై వ్యాఖ్యలు చేశారు.

బాబీ కథ చెప్పిన విధానం నాకు నచ్చింది. అతని ప్రతిభ మీద నాకు నమ్మకం ఉంది. బలదేవ్ సహాయ్ క్యారెక్టర్, 100కి డయల్ చేస్తే పోలీస్ రావడం లేదు, 100 రూపాయల నోటు ఇస్తే పోలీసులు వస్తున్నారు. అని తల్లి చెప్పే డైలాగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. వెంటనే సినిమా అంగీకరించాను. సినిమా విజయం సాధించడం అందంగా ఉంది అని రవితేజ చెప్పారు. ప్రతి సినిమాలో ప్రేక్షకులు ఆశించే వినోదం ఉండేలా చూసుకోవడమే తెలుసునని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు