రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నెక్స్ట్ షెడ్యూల్ డీటెయిల్స్

Published on Jan 25, 2024 3:02 AM IST

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగిల్ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ తో రవితేజ చేస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ భొర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అభిమన్యు సింగ్ కీలక పాత్ర చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తోంది. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని తమిళనాడు లోని కరైకుడి లో నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా హీరో రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఫ్లైట్ లో కరైకుడి బయల్దేరిన వెళ్లిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా ఇలియానా హీరోయిన్ గా 2018లో తెరకెక్కిన బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రెయిడ్ కి అఫీషియల్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు