దీపావళికి కాన్సెప్ట్ పోస్టర్ తో రానున్న మాస్ రాజా !

Published on Oct 27, 2018 9:44 am IST

మాస్ మహారాజ్ రవితేజ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నాడని తెలిసిందే. తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కాన్సెప్ట్ పోస్టర్ ను దీపావళి రోజు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో ముగ్గరు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నాబా నటేష్ ను ఎంపిక చేశారు.

ఈచిత్రాన్ని ‘నేల టిక్కెట్టు’ నిర్మాత రవి తాళ్లూరి నిర్మించనున్నారు. ఇక రవితేజ ప్రస్తుతం రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ త్వరలో ప్రేక్షకులముందుకు రానుంది. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నాఈచిత్రాన్నిమైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.

సంబంధిత సమాచారం :