
మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘పవర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఠాగూర్ హౌస్ లో జరుగుతోంది. చాలా గ్రాండ్ గా ఉండే ఈ ఠాగూర్ హౌస్ లో ప్రధాన పాత్రదారులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
రవితేజ సరసన హన్సిక, రెజీనా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కె.రవీంద్రనాథ్ (బాబీ) దర్శకుడిగా పరిచయం కానున్న్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. రవితేజ పూర్తి మాస్ లుక్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

