భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తా : రవి తేజ

భవిష్యత్‌లో డైరెక్షన్ చేస్తా : రవి తేజ

Published on Aug 19, 2015 3:32 PM IST

Ravi-teja
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కిక్ 2’. హీరో కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమైంది. 2009లో రవి తేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ‘కిక్’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండడంతే ఇప్పటికే ‘కిక్ 2’ టీమ్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ కోవలోనే హీరో రవితేజ ఈ ఉదయం ఫేస్‌బుక్‌లో అభిమానులతో ఓ చాట్ సెషన్ నిర్వహించారు.

అభిమానులు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు రవితేజ తనదైన స్టైల్లో సరదా సరదా సమాధానాలు ఇచ్చారు. ఇక ఫ్యూచర్‌లో దర్శకత్వం చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే ప్రశ్నకు సమాధానంగా.. కచ్చితంగా ఫ్యూచర్‌లో డైరెక్షన్ చేయాలని ఉందంటూ రవితేజ సమాధానమిచ్చారు. అయితే తాను దర్శకుడిగా మారినా నటుడిగా కొనసాగుతూనే ఉంటానని, తాను దర్శకత్వం చేసే సినిమాల్లో తానే స్వయంగా హీరోగా చేసే ఆలోచన అస్సలు లేదంటూ రవితేజ ఈ సందర్భంగా స్పష్టం చేయడం ఆసక్తికరంగా కనిపించింది. ‘కిక్ 2’ సినిమా అందరినీ ఆకట్టుకునే ఎంటర్‌టైనర్ అని, సురేందర్ రెడ్డితో రెండో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని రవి తేజ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు