రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ వర్షన్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ వర్షన్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

Published on Feb 13, 2024 3:01 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా తాజాగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈగిల్ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో మంచి టాక్, కలెక్షన్ తో కొనసాగుతోంది. ఇక గత ఏడాది యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన బయోపిక్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ మంచి విజయం అందుకుంది.

నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో నాజర్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్, సుదేవ్ నాయర్, రేణు దేశాయ్ తదితరులు కీలక పాత్రలు చేసారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ హిందీ వర్షన్ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా కలర్స్ సినీ ప్లెక్స్ ఛానల్ లో ఫిబ్రవరి 18 రాత్రి 8 గం. లకు ప్రసారం చేయనున్నారు. ఇక ఈమూవీకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ పై అభిషేక్ గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు