
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కిక్ 2’. 2009 లో వచ్చి సూపర్ హిట్ అయిన కిక్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. అన్ని కార్యక్రమాలను ఫినిష్ చేసుకొని ఫస్ట్ కాపీని కూడా సిద్దం చేసిన ఈ సినిమా ఆగష్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కి మరో 4 రోజులు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా సాగుతున్నాయి. కిక్ సినిమాలో లానీ ఈ సినిమాలో కూడా హై లెవల్ కామెడీ ఉంటుందని ఇది వరకే తెలియజేశాం. కామెడీతో పాటు అందరినీ సర్ప్రైజ్ చేసేలా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని హీరో రవితేజ అంటున్నాడు.
యాక్షన్ ఎపిసోడ్స్ అంటే రెగ్యులర్ సినిమాల్లో కనిపించేవి కాదట, టాలీవుడ్ లో ఇలాంటి స్టంట్స్ మునుపెన్నడూ చూడలేదని, ఆ స్టంట్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తాయని అంటున్నారు. రీసెంట్ గా రవితేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కిక్ సినిమాలోని రవితేజ వారసుడిగా కిక్ 2 లో కనిపిస్తాను. ఒక మిషన్ మీద ప్రయాణం మొదలెట్టిన కుర్రాడి కథ. ఈ సినిమాలో నా పాత్ర ఎంత కొత్తగా ఉంటుందో, అదే విధంగానే కొత్త తరహా స్టంట్స్ ని డిజైన్ చేసాం. ఇలాంటి స్టంట్స్ ని ఇది వరకూ మనం తెలుగు సినిమాలో రాలేదని’ రవితేజ తెలిపాడు. రవితేజ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ప్రకారం రవితేజ – బ్రహ్మానందంల కామెడీ తో పాటు రోమాలు నిక్కబొడుచుకునే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని అర్థమవుతోంది.
రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

