ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న రవితేజ ‘ఈగిల్’

ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న రవితేజ ‘ఈగిల్’

Published on Mar 2, 2024 2:03 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, మధుబాల, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ఈగిల్. ఈ మూవీని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకున్న ఈ మూవీ నిన్న ప్రముఖ ఓటిటి మాధ్యమాలు ఈటివి విన్, అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ ముందుకి వచ్చాయి. విషయం ఏమిటంటే, ఓటిటి లో రిలీజ్ అయిన కేవలం 24 గంటల్లోనే అమెజాన్ ప్రైమ్ లో ఇండియా వైడ్ గా ఈగిల్ మూవీ టాప్ 3 గా కొనసాగుతూ ట్రెండ్ అవుతుండడం విశేషం. వీకెండ్ కావడంతో ఈ రెండు రోజులు ఈ మూవీకి మరింతగా వ్యూస్ లభించే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు