వైరల్ అవుతోన్న ‘డిస్కోరాజా’ ఫస్ట్ లుక్ !

వైరల్ అవుతోన్న ‘డిస్కోరాజా’ ఫస్ట్ లుక్ !

Published on Sep 3, 2019 12:04 AM IST

మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం ‘డిస్కోరాజా’. సెప్టెంబర్ 2న వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతొంది. ఇక సెప్టెంబర్ 3 నుంచి గోవాలో కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ హాంగులతో, గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసి నిర్మిస్తున్నారట. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతుంది. ఇక వెన్నెల కిషోర్ హిలేరియస్ కామెడీ తో ప్రేక్షకలకు నవ్వుల విందు పంచనున్నాడట. మరి డిసెంబర్ 20న డిస్కోరాజా బాగా నవ్వించబోతున్నాడు అన్నమాట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు