పూజా కార్యక్రమాలతో రవితేజ 75వ చిత్రం ప్రారంభం

పూజా కార్యక్రమాలతో రవితేజ 75వ చిత్రం ప్రారంభం

Published on Jun 11, 2024 9:58 AM IST

మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రవితేజ తన కెరీర్‌లోని మైల్‌స్టోన్ 75వ సినిమాను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ఈ సినిమాను పూజా కార్యక్రమంతో తాజాగా ప్రారంభించారు చిత్ర యూనిట్.

ఔట్ అండ్ ఔట్ కామెడీ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో రవితేజతో పాటు అందాల భామ శ్రీలీల కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలుపెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని మిగతా క్యాస్టింగ్ గురించిన వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు