‘డిస్కోరాజా’ రెండో షెడ్యూల్ కు డేట్ ఫిక్స్ !

Published on May 6, 2019 12:34 pm IST


మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా”‌. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఈ చిత్రం ఆగిపోయిందా అనే అనుమానాలతో కొన్ని వార్తలొచ్చాయి. ఈ వార్తల్ని నిర్మాత రామ్ తళ్లూరి, ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ ఖండించారు.

ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ మే 27 నుంచి హైద‌రాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ లో జరగనుంది. మే 27 నుంచి జూన్ 21 వ‌ర‌కు చేయబోతున్న ఈ షెడ్యూల్ లో పాయల్ రాజపుత్, నభా నటేష్ హీరోయిన్లు అలానే సునీల్, రామ్ కి, బాబీ సింహా, వెన్నెల కిషోర్ త‌దితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

నేల టిక్కెట్ తర్వాత ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ అధినేత రామ్ తాళ్ళూరి, రవితేజ తో నిర్మిస్తున్న రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More