టాక్..”సలార్” తో “ఈగల్” మాసివ్ ట్రీట్.?

టాక్..”సలార్” తో “ఈగల్” మాసివ్ ట్రీట్.?

Published on Dec 10, 2023 11:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం రిలీజ్ సన్నాహాలు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా దీనితో అయితే మాస్ మహారాజ రవితేజ నటించిన యాక్షన్ ప్రాజెక్ట్ “ఈగల్” తాలూకా మాసివ్ ట్రీట్ రాబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

మరి ఆల్రెడీ టీజర్ ఫస్ట్ సింగిల్ లో ఈగల్ చిత్రం మంచి బజ్ ని సెట్ చేసుకోగా ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ని అయితే సలార్ రిలీజ్ ప్రింట్ తో అటాచ్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో మాస్ మహారాజ్ మాసివ్ ట్రీట్ సలార్ తో మొదలు కాబోతుంది అని చెప్పాలి. అలాగే మేకర్స్ కూడా సాలిడ్ ప్లానింగ్ ని అయితే చేసారని చెప్పొచ్చు. మరి ఈ క్రేజీ బజ్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు