ఓటిటి: గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న ‘ఇరుముడి’.. 11 దేశాల్లో టాప్ 10..!

ఓటిటి: గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న ‘ఇరుముడి’.. 11 దేశాల్లో టాప్ 10..!

Published on Sep 26, 2026 2:01 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘ఇరుముడి’. ఫస్ట్ లుక్ నుంచే సాలిడ్ బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం తీరా థియేటర్స్ లో విడుదల అయ్యిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి రవితేజ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రికార్డు రన్ తో భారీ లాభాలు ఈ సినిమా అందుకుంది.

ఇక థియేటర్స్ నుంచి ఇటీవల ఓటిటి లోకి వచ్చి ఇక్కడ కూడా సెన్సేషన్ ని సెట్ చేస్తుంది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో అదరగొడుతుంది. ఇరుముడి ప్రస్తుతం గ్లోబల్ గా నాన్ ఇంగ్లీష్ సినిమాల లిస్ట్ లో టాప్ 3 లో ట్రెండ్ అవుతుంది.

అలాగే వరల్డ్ వైడ్ గా మొత్తం 11 దేశాలలో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం ట్రెండ్ అవుతుంది. దీనితో ఇరుముడి మేనియా ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు