టీజర్ టాక్ : ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది’.. అదరగొట్టిన ‘మాస్‌ జాతర’ !

massjathara 2

భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ నుంచి రానున్న 75వ చిత్రం ‘మాస్‌ జాతర’, మనదే ఇదంతా.. అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్ లో రవితేజ పోలీస్‌ పాత్రలో ‘నాకంటూ ఓ చరిత్ర ఉంది..’ అంటూ మాస్‌ డైలాగులతో అలరిస్తూ కనిపించడం ఆకట్టుకుంది. ముఖ్యంగా రవితేజ లుక్ అండ్ బిజియమ్ సినిమా పై అంచనాలను పెంచింది.

మొత్తానికి మరోసారి రవితేజ తన మాస్ ఇమేజ్ తో ఈ టీజర్ లో తనదైన మార్క్ చూపించాడు. ఇక ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి స్ట్రాంగ్ రెస్పాన్స్ లభిస్తుంది. టీజర్ లో షార్ప్ కట్స్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. కాగా ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫ్యాన్స్ కూడా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీజర్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version