మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “క్రాక్”. ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబడి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా కూడా ఈ చిత్రం నిలిచింది.
అయితే ఇప్పటికీ కూడా పలు చోట్ల నిలకడగా వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో కూడా దుమ్ము లేపుతుంది. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 5 నున్నచీ స్ట్రీమింగ్ కు కూడా తీసుకురాగా ఈ నాలుగు రోజుల్లో “క్రాక్” సినిమాకు ఏకంగా 5 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా వారు తెలిపారు.
దీనితో మాస్ మహారాజ్ క్రాకింగ్ బ్లాక్ బస్టర్ అక్కడ కూడా స్యూర్ షాట్ గా తగిలింది అని చెప్పాలి. థమన్ టెర్రిఫిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గోపీచంద్ మాస్ టేకింగ్ అలాగే సముథ్రఖని మరియు వరలక్ష్మి శరత్ కుమార్ ల పెర్ఫవుమెన్స్ లు ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి.
