మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు.
సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్సిడ్ రెస్పాన్స్ దక్కింది. థియేట్రికల్ రన్లో అనుకున్న మేర విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానుంది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రాన్ని జీ5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ట్రయాంగిల్ లవ్ అండ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేశారు.
