మాస్ మహారాజా రవితేజ తన కెరీర్లో మొదటిసారి ఒక చిన్నారికి తండ్రిగా నటిస్తున్న వైవిధ్యభరితమైన చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతుళ్ల మధ్య సాగే అత్యంత బలమైన ఎమోషన్స్ నేపథ్యంతో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్రంలో కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తుండగా, తాజాగా రవితేజ మరియు బేబీ నక్షత్ర తమ పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించారు. దర్శకుడు శివ నిర్వాణ దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ‘అయ్యప్ప పడి పూజ’ పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
మరో మూడు రోజుల చిన్న షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఆగస్ట్ 21న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. నేషనల్ అవార్డ్ విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ అప్పుడే రీ-రికార్డింగ్ పనులు కూడా మొదలుపెట్టగా, త్వరలోనే ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
